Oct 28,2021 09:22

అనంతపురం : అనంతపురంలోని పుట్లూరు మండలంలో పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మాడుగు పల్లి గ్రామానికి చెందిన నరేష్‌ కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి వీటిని తయారు చేసి.. విక్రయించేందుకు తీసుకెళుతుండగా పట్టుకున్నారు. నరేష్‌ను అరెస్టు చేసి.. ప్రశ్నించగా విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. తాను వీటిని యూట్యూబ్‌లో చూసి తయారు చేశానని చెప్పాడు.