Apr 11,2021 14:59

లక్నో : కరోనా దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. పలు రాష్ట్రాలు వీకెండ్‌, నైట్‌ కర్ఫ్యూలను విధించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ కూడా ఈ కోవలోకి వచ్చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో నూతన ఆంక్షలు తీసుకువచ్చింది. కేసులు విశృంఖలంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం యోగి సర్కార్‌ ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదేవిధంగా పలు జిల్లాల్లో వందకు పైగా కేసులతో పాటు 500 క్రియా కేసులు వెలుగుచూడటంతో నైట్‌ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్లు ప్రకటనలో యుపి సర్కార్‌ పేర్కొంది. అంతకముందు నైట్‌ కర్ఫ్యూ విధింపు అంశాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించగా.. రాష్ట్ర రాజధాని లక్నో, కాన్పూర్‌, వారణాసి, ప్రయాగ్‌ రాజ్‌ వంటికి ఇప్పటికే కర్ఫ్యూ బాట పట్టాయి. నవరాత్రి, రంజాన్‌ పర్వదినాలను పురస్కరించుకుని... ప్రభుత్వం శనివారం సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత... మతపరమైన ప్రదేశాల్లో ఐదుగురుకు మించి గుమిగూడరాదని ఆంక్షలు విధించింది.