Nov 20,2020 21:15

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో బలెరో వాహనం వేగంగా వచ్చి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢకొీనడంతో ఆరుగురు పిల్లలతో సహా 14మంది మృతి చెందారు. మణిక్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రయాగ్‌ రాజ్‌ - లక్నో హైవేలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు నవాబ్‌గంజ్‌లో వివాహానికి వెళ్లి తమ గ్రామమైన కుందా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు నుంచి కారును వేరు చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.