Nov 22,2020 18:21

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఓ కుక్క కష్టమొచ్చింది. తన యజమాని ఎవరో తెలుసుకునేందుకు డిఎన్‌ఎ పరీక్షలకు వెళ్లింది. కుక్కకు డిఎన్‌ఎ పరీక్షలా..అంత అవసరేమోమొచ్చిందీ అని ఆలోచనలో పడ్డారా... ఇది వాస్తవమేనా..అని అనుకుంటున్నారా..ముమ్మాటికీ వాస్తవమే. పూర్తి వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని హోసంఘాబాద్‌లో 3 ఏళ్ల లాబ్రడార్‌ కుక్క ..తనదంట,.తనదని షాదబ్‌ ఖాన్‌..కార్తీక్‌ శివహరేలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. కోకో అనే నల్లటి లాబ్రడార్‌ జాతికి చెందిన కుక్కను తాను పొగొట్టుకున్నానని, ఈ కుక్కను తాను 2017లో కొనుగోలు చేశానని, దాన్ని ఎబివిపి నేత శివ తన ఇంట్లో బంధించి..వేరొకరి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఖాన్‌ ఆరోపణలు చేశారు. తన కుక్క తప్పిపోయిందని ఆగస్టులో ఫిర్యాదు చేసినట్లు జర్నలిస్టు అయిన ఖాన్‌ చెప్పారు. కాగా, శివ ఫ్యామిలీ..ఇది తమ కుక్క అని..దీని పేరు టైగర్‌ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఈ నెల 18న పోలీసులను ఆశ్రయించారు. ఆ కుక్కుకు డిఎన్‌ఎ నిర్వహించాలని ఖాన్‌ డిమాండ్‌ చేశారు. మరుసటి రోజు శివ కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఈ కుక్క తమదేనంటూ ఫిర్యాదు చేశారు. దీని యజమాని ఎవరో తేల్చేందుకు కుక్కను అదుపులోకి తీసుకున్న అధికారులు..శనివారం డిఎన్‌ఎ పరీక్షల నిమ్తితం దాని రక్త నమూనాలను సేకరించారు. డిఎన్‌ఎ శాంపిల్స్‌ సేకరించామని, దర్యాప్తు చేపడుతున్నామని, ఫలితాల అనంతరం దీని నిజమైన యజమానికి కుక్కను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.