Mar 05,2021 17:03

యద్దనపూడి(ప్రకాశం): విశాఖ ఉక్కు పరిశ్రను ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకరిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నాయకులు పాల్గన్నారు. ఈ సంధర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వీరగంధం రామయ్య మాట్లాడుతూ నష్టాలు అనే సాకుతో కేంద్రప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మైలా.చిననాగేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోలు ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులను ఇబ్బంది పాలుచేస్తూ కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు చేకూర్చడం దారుణం అన్నాడు. కార్యక్రమంలో మార్టూరు మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గొట్టిపాటి.పేరయ్య, అనంతవరం గ్రామ యస్‌.సి.ఆర్‌.పి సొసైటీ యువకులు దిలీప్‌ రాజు, రాజేశ్వరరావు, శేఖర్‌, అచ్యత్‌, జీవరత్నం, ప్రేమ్‌, శాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.