Sep 15,2021 21:37
Visakha-Mumbai టికెట్‌ చూపుతున్న మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ నుంచి ముంబయి ఇతర గమ్యస్థానాలకు వెళ్లేందుకు 38 స్పైస్‌జెట్‌ విమానాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం వచ్చువల్‌ విధానంలో ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి ముంబయికి నాన్‌స్టాప్‌ విమానాలతో పాటు ఉదరుపూర్‌తో చెన్నరు, ఢిల్లీ, మాలేనును కలుపుతూ, బెంగళూరు, జైపూర్‌, ఢిల్లీని కలుపుతూ మరికొన్ని విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజరుసింగ్‌ తెలిపారు. విశాఖపట్నం, సూరత్‌, అజ్మీర్‌, మంగలూరు, బెంగళూరు, వారణాసి, జైపూర్‌, చెన్నరు, గోవా, పూనె, పాట్నా, ఉదరుపూర్‌, అహ్మదాబాద్‌ల నుంచి ఇతర అంతర్జాతీయ గమ్యస్థానాలకూ వెళ్లచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ వికె సింగ్‌, సెక్రటరీ ప్రదీప్‌సింగ్‌ ఖరోలా, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సంజీవ్‌కుమార్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పాల్గన్నారు.