Jul 30,2021 21:05

matladutunna hanumantharao

వ్యవసాయ నల్లచట్టాలను రద్దుచేయాల్సిందే
ప్రజాశక్తి-జగ్గయ్యపేట
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దంతాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. రైతు సంఘం పశ్చిమకృష్ణాజిల్లా నాయకుల చిరుమామిళ్ల హనుమంతరావు తదితర నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ సంస్థలను చౌకబారుగా కట్టబెడుతోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను పార్లమెంట్లో నూటికి నూరు శాతం ప్రైవేటుపరం చేస్తామని చెప్పడం చాలా దారుణమన్నారు. ఢిల్లీలో వ్యవసాయ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ రైతులు ఎనిమిది నెలలుగా పోరాటాలు చేస్తూ 700 మంది రైతులు మతి చెందినా కేంద్ర ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేకపోవటం చాలా దారుణమన్నారు. ఆగస్టు 9న వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు సోమోజు నాగమణి, సిఐటియు నాయకులు షేక్‌ గౌస్‌ మియా, టి.ఫణిధర్‌, ఎస్‌.రామనాథం, ఏఐటియుసి నాయకులు పి.వెంకటేశ్వర్లు, అంబోజి శివాజీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నాయకులు విజరుకుమార్‌, పంచాయతీ రాజ్‌, ముఠా కార్మికులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.