విద్యుత్ ఎస్ఇ ఆఫీసు ముందు రైతు సంఘాల ధర్నా
ప్రజాశక్తి- కర్నూల్ కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ వామపక్ష రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఇ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎపిరైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం అధ్యక్షత వహించారు. ఎపి రైతు సంఘం పశ్చిమ జిల్లా కార్యదర్శి జి.రామకష్ణ, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు అర్లప్ప, వెంకటేష్, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ పోతుల శేఖర్, రైతు సంఘం నాయకులు జి.మద్దిలేటి, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి కె .ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించ రాదరన్నారు. ఈ నిర్ణయం రైతు కుటుంబాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. కొన్ని నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించలేం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటూ విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తే పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో రెండు లక్షా30 వేల బావులకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ అధికారులు మోటార్లకు మీటర్లు బిగించడానికి వస్తే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. ఈ నెల 26 27 తేదీల్లో ఢిల్లీలో లక్షలాది మంది రైతులతో ధర్నా చేశారన్నారు. ఈ ధర్నాకు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుండి వచ్చిన రైతులపై జల ఫిరంగులు, భాష్పవాయువు, లాఠీచార్జీ చేసి అడ్డగించడం చాలా దారుణమన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు విరమించుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ ఎస్ఇకి వినతిపత్రాన్ని సమర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు , రైతు సంఘం నాయకులు మహేష్, ఎఐ వైఎఫ్ నగర కార్యదర్శి బీసన్న, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు పిఎస్. రాధాకష్ణ, డి.గౌస్ దేశారు నగర అధ్యక్ష కార్యదర్శులు ఇ.పుల్లారెడ్డి, అంజిబాబు, ఎం. గోపాల్, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ పాల్గొన్నారు.
ప్రభ్యుత దిష్టిబొమ్మను దహనం
ఆత్మకూరు : ఆర్టిసి బస్టాండ్ ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్ష్య, కార్యదర్శులు మాబాష, పి.సుధాకర్, నాయకులు స్వాములు, ఎ.రణధీర్, శ్రీధర్, వీరన్న, నరసింహ నాయక్, చందావారి వెంకటేశ్వర్లు, డి.రామ్ నాయక్ పాల్గొన్నారు.
పాములపాడు : పాములపాడు ప్రధాన సెంటర్లో నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు బి.రామేశ్వర రావు, జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సామన్న తెలిపారు.
వెలుగోడు : విద్యుత్ కార్యాలయం వద్ద ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యుత్ ఎఇ రవీంద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. యాదాటి నాగేంద్రుడు, పాపయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు.
ఆదోనిరూరల్ : గణేకల్లు సబ్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. వ్యకాస మండల కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు రామదాసు, రామాంజనేయులు, వీరారెడ్డి పాల్గొన్నారు.
దేవనకొండ : విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగదీష్, రైతు సంఘ నాయకులు నల్లన్న పాల్గొన్నారు.
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యకాస ఆధ్వర్యంలో నంద్యాల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అధికారి సంజీవ రాయుడుకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు సద్దాం హుస్సేన్, పుల్లా నరసింహులు, మాట్లాడారు. నాయకులు శివారెడ్డి, నిరంజన్ , రాజేష్ గణేష్ ,దుర్గా పాల్గొన్నారు.
జూపాడుబంగ్లా: రైతు సంఘం జిల్లా నాయకులు బెస్త రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి పకీర్ సాహెబ్ ఆధ్వర్యంలో నందికొట్కూరు సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ ఎఇ మదన్ మోహన్ కు వినతి పత్రం అందజేశారు.
నందవరం: సబ్ స్టేషన్ ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రైతు సంఘం నాయకులు దేవపుత్ర మాట్లాడారు. స్వామి దాసు, కపరావు, రైతులు శ్రీరాములు, దస్తగిరి, ప్రకాశం, లక్ష్మన్న, పాల్గొన్నారు.
ఆదోని: దొడ్డనగేరి విద్యుత్తు సబ్ స్టేషన్ ముందు నాయకులు తిక్కప్ప, గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. తిమ్మారెడ్డి, రాందాస్, రామాంజి, తాయప్ప నరసింహులు, బంగారయ్య పాల్గొన్నారు.
పత్తికొండ: రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్య, రంగారెడ్డి డిమాండ్ చేశారు. సిద్దయ్య గౌడ్ అధ్యక్షతన ధర్నా చేశారు.
వెల్దుర్తి : విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎఐకెఎస్ నాయకులు మాధవ కష్ణ మాట్లాడారు. కష్ణ, బాల రాజు, మనోహర్, కిరణ్, బాలు, అడవి రాముడు పాల్గొన్నారు.
విద్యుత్ ఎస్ఇ ఆఫీసు ముందు రైతు సంఘాల ధర్నా