Oct 27,2021 19:16

ఇంటర్నెట్‌డెస్క్‌ : టాలీవుడ్‌ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఏ పాత్రలో నటించినా... ఆయన వాక్‌చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆయన వెండితెరపైనే కాదు.. ఇప్పుడు ఓటీటీలోనూ సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆహాలో 'అన్‌స్టాపబుల్‌' అనే షోకి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో.. 'మాటల్లో ఫిల్టర్‌ ఉండదు.. సరదాలో స్టాప్‌ ఉండదు', 'సై అంటే సై.. నై అంటే నై' అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. సినీ ప్రముఖుల జీవితాన్ని ఆవిష్కరించనున్న ఈ షో నవంబర్‌ 4 నుంచి ప్రారంభం కానుంది.

ప్రోమో  https://youtu.be/nugtpLfdiD0