Feb 25,2021 19:15

టీకా వేయించుకుంటున్న డిఎస్‌పి

ప్రజాశక్తి - గూడూరు :కోవిడ్‌ వ్యాక్సిన్‌పై సురక్షితమని, అపోహలొద్దని గూడూరు డిఎస్‌పి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గూడూరులోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోలీస్‌ సిబ్బందికి కోవిడ్‌ టీకా వేశారు. ఈ సందర్భంగా గూడూరు డిఎస్‌పి రాజగోపాల్‌రెడ్డి, సిఐలు దశరథ రామారావు , శ్రీనివాసులు రెడ్డి, ఎస్‌ఐలు సైదులు, బ్రహ్మనాయుడు తదితరులు టీకా వేయించుకున్నారు. డిఎస్‌పి మాట్లాడుతూ సబ్‌ డివిజన్‌ పరిధిలో కోవిడ్‌ టీకాను వేయించుకునేందుకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 580 మంది సిబ్బంది కరోనా టీకాను వేయించుకోవాల్సి ఉందన్నారు. గూడూరు సర్కిల్‌ పరిధిలోని పోలీసులకు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో టీకా వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.