Feb 05,2021 12:48

విజయనగరం: జిల్లాలోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు శుక్రవారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకుంటున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ డా.ఆర్‌. మహేష్‌ కుమార్‌, తానే స్వయంగా వ్యాక్సిన్‌ వేయించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. జె.సి.మహేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి. రమణ కుమారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.