Feb 05,2021 12:24

నరసాపురం(పశ్చిమగోదావరి): కోవిడ్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, నిర్భయంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని నరసాపురం సబ్‌ కలెక్టర్‌ శ్రీ కె ఎస్‌ విశ్వనాథన్‌ అన్నారు. కోవిడ్‌ ఫ్రెంట్‌ లైన్‌ వారియర్స్‌ అయిన రెవెన్యూ, అధికారులు, సిబ్బందికి శుక్రవారం ప్రారంభించిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ విశ్వనాథన్‌ మొదటి టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై కొంతమందిలో అవగాహన లోపం, భయం, అపోహలు, వంటి కారణాలతో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెనుకాడుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో వేలాదిమంది వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ చేయించుకుని ఆరోగ్య వంతంగా ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్‌ పై అక్కడక్కడా వచ్చే వదంతలను, దుష్ప్రచారాలకు తెరదించేందుకు కోవిడ్‌ ఫ్రెంట్‌ లైన్‌ రెవెన్యూ అధికారిగా తాను మొదటి టీకాను వేయించుకున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం, దుష్ప్రభావాలు కానీ సంభవించలేదని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ఈ విషయంలో అందరూ అవగాహనతో నిరభ్యంతరంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకుని డివిజన్‌ ను కోవిడ్‌ రహిత డివిజన్‌ గా తీర్చి దిద్దాలన్నారు.ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ కోరారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ కె.వి.రామకఅష్ణ, కార్యాలయ పాలన అధికారి వీరా. పోతన, కె ఆర్‌ సి తహశీల్దార్‌, ఆర్‌వి. కఅష్ణారావు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.