Apr 08,2021 20:02

జంగారెడ్డిగూడెం:స్థానిక కేసనపల్లి వారి వీధి 6వ సచివాలయంలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఛైర్‌ పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి గురువారం ప్రారంభించారు. స్థానిక కేసనపల్లి వారివీధి పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద సచివాలయంలో ఉచిత వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ పట్టణ పరిధిలోని 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.