Oct 24,2020 21:33

మృతి చెందిన రామసుబ్బయ్య

ప్రజాశక్తి-వెలిగండ్ల : మండలంలోని వెదుళ్లచెరువు పంచాయతీ బాలవెంగన్నపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. హెచ్‌ఎంపాడ్‌ ఎస్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాల మేరకు.. అన్నెబోయిన రామసుబ్బయ్య (70) అనే వ్యక్తి తన పొలంలో కాపలా కాసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. తన పొలంలో ఉన్న గది వరండాలోని మంచంపై నిద్రిస్తున్నాడు. ఉదయం అటువైపు వెళ్లిన గ్రామస్తులు దగ్ధమైన మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి రామసుబ్బయ్య శరీరం 90 శాతం కాలిపోయి ఉంది. కుటుంబ సభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలిని కనిగిరి సిఐ వెంకటేశ్వరరావు, క్లూస్‌టీమ్‌ డిఎస్‌పి కోటేశ్వరరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.