Apr 07,2021 21:29

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ వరుసగా ఐదో సారి సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించింది. గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీ బుధవారంతో ముగిసింది. ఈ సందర్బంగా దాస్‌ మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతుండటం, ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంగా రెపోరేటు 4 శాతంగా, రివర్స్‌ రెపోరేటు 3.3 శాతంగానే కొనసాగుతాయన్నారు. కరోనా మళ్లీ విజృంభణతో దేశీయ ఆర్థిక ప్రగతి అస్థిరంగా మారిందన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేయడం వల్ల వృద్థి పునరుత్తేజంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే చేబదుళ్ల ('వేస్‌ అండ్‌ మీన్స్‌) పరిమితిని రూ.47,010 కోట్లకు పెంచినట్లు ఆర్‌బిఐ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని, మూడో త్రైమాసికం నాటికి అది 4.4 శాతానికి పరిమితం కావచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. 2021-22లో దేశ వఅద్ధి రేటు 10.5 శాతానికి చేరొచ్చని పేర్కొంది.