Oct 28,2021 16:42

వర్షానికి కొట్టుకుపోయిన సంత బైలు రోడ్డు

ప్రజాశక్తి - వెదురు కుప్పం : మండలంలోని సంతబైలు గ్రామం నుండి పాతగుంట రోడ్డుకు వెళ్లే లింక్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముత్యాలనాయుడు చెరువు నుండి మొరవ నీళ్లు వెళ్లే క్రమంలో మధ్యలో ఉన్న కల్వర్టు లీకేజ్‌ కావడంతో సంత బైలు రోడ్డు పూర్తిగా దెబ్బతిందని గ్రామస్థులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్డును బాగు చేసి సంతబైలు గ్రామానికి రాకపోకలు యదాతధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియజేసినా ఏ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై నిత్యం గ్రామస్తులు పశువులు మేయడానికి, పొలాల వద్దకు పోవడానికి అనువుగా ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఇటు రాజకీయ పార్టీ నాయకులు, అటు అధికారులు స్పందించాలని కోరుతున్నారు..