Nov 29,2020 23:43

దెబ్బతిన్న గుళ్లవాగు బ్రిడ్జి

సంతనూతలపాడు రూరల్‌ : తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు మండల పరిధిలోని సంతనూతలపాడు - మైనం పాడు మధ్యనున్న గుళ్లవాగు బ్రిడ్డి దెబ్బతింది. బ్రిడ్జిపై ఇరువైపుల ఉన్న గోడలు కూలిపోయాయి. బ్రిడ్జిపై గుంతలు ఏర్పడ్డాయి.అదే విధంగా సంతనూలపాడు నుంచి మైనంపాడు వెళ్లే రహదారి, మైనంపాడు నుంచి చలప్పాలెం వెళ్లే రహదారిపై అక్కడక్కడ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో ఈ రహదారులపై ప్రయాణించేందుకు వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి, రహదారులకు మరమ్మతులు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.