Nov 30,2020 21:06

కలెక్టర్‌కు చెక్కును అందజేస్తున్న పెనుబాల విజరుకుమార్‌

కడపఅర్బన్‌ బగ్గవంక వరదబాధితులకు అండగా ఉంటానని లీగల్‌ ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కోశాధికారి, వైసిపి నాయకులు పెనుబాల విజరుకుమార్‌ అన్నారు. సోమవారం సొసైటీ తరపున లక్ష రూపాయల చెక్కును కలెక్టర్‌ హరికిరణ్‌కు అందజేశారు. బుగ్గవంక నిర్వాసితుల సహాయార్థం మొట్టమొదటి చెక్కును అందించిన పెనుబాలను కలెక్టర్‌ అభినందించారు. ఆకాశవాణి మాజీ ప్రోగ్రాం హెడ్‌, ఎల్‌సిజి డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు విజయసారధి మాట్లాడుతూ నిరాశ్రయులను ఆదుకోవడం అందరి బాధ్యత అన్నారు. కోవిడ్‌ సంక్షోభంలో ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. పెనుబాల విజయకుమార్‌ మాట్లాడుతూ బుగ్గవంక నిర్వాసితుల కోసం రూ.35 కోట్లు మంజూరు చేసిన సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలి పారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. నిధుల కేటాయింపునకు చొర చూపిన డిప్యూటీ సిఎం అంజాద్‌బాష, మాజీ మేయర్‌ సురేష్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మురళీధర్‌రెడ్డి, మీ కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి, మానవ హక్కుల కార్యకర్త స్వరూప్‌కుమార్‌ పాల్గొన్నారు.