Nov 29,2021 12:42

తాడేపల్లి (అమరావతి) : ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర బృందం సోమవారం సమావేశమయ్యింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బృందం పర్యటించింది. వరద ముంపుకు గురయిన నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో అధికారులు పర్యటించి నివేదికను సిద్ధపరిచారు. వరద నష్టంపై కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి జగన్‌ నేడు భేటీ అయ్యారు.