Dec 05,2021 19:09

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -గూడూరు :పట్టణంలోని జక్కా వెంకయ్య శ్రామిక నగర్‌లో నివసిస్తున్న వరద బాధితులు సర్వం కోల్పోయారని, వారందరిని ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్‌ యాదగిరి, ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు ఆ కాలనీలోని వరద ముంపునకు గురైన నిరాశ్రయులను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 2వేలు నగదు కానీ, బియ్యం గానీ ఇవ్వలేదని బాధితులు వాపోయారు. సిపిఎం నాయకులు స్పందిస్తూ ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రూ. 10 వేల నగదు, ఇతర వస్తువులు అందజేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినవారందరినీ ఆదుకోవాలని కోరారు. జిల్లా నాయకులు ఎం మోహన్‌ రావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్‌. యాదగిరి, గూడూరు పట్టణ కార్యదర్శి పి మణి, రైతు కార్మిక సంఘం నాయకులు జోగి శివకుమార్‌, బివి. రమణయ్య, వెంకట్రావు పాల్గొన్నారు.