Nov 30,2020 20:42

బాధితులతో మాట్లాడుతున్న టిడిపి నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

బాధితులతో మాట్లాడుతున్న టిడిపి నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
వరద బాధితులకు
రూ.10వేలు అందజేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు :నివర్‌ తుపాన్‌ వరద తాకిడికి నష్టపోయిన బాధితులకు తక్షణమే రూ.10వేలు, బస్తా బియ్యం అందజే యాలని టిడిపి నగర ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలో వరద నీటి తాకిడికి గురైన భగత్‌ సింగ్‌ కాలనీలో ఆయన పర్యటించారు.అనంతరం మీడియాతో మాట్లా డుతూ ఇరిగేషన్‌ గురించి తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఇట్లానే ఉంటుందన్నారు. తుపాన్‌ తీవ్ర స్థాయిలో ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ వాటిని పట్టించు కోకపోవడం, సోమశిల ప్రాజెక్టుకు అత్యధికంగా నీరు చేరడం, నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో పెన్నా పరివాహక ప్రాంతాన్ని వరదనీరు చుట్టుముట్టాయన్నారు. భగత్‌ సింగ్‌ కాలనీలో ఇంటింటికి వెళ్లి బాధితులతో మాట్లా డారు.
ఈ సమయంలో పలువురు మహిళలు మాట్లాడుతూ ఒక్కసారిగా వరద నీరు తమ ఇళ్లను చుట్టముట్టడంతో ఇంట్లో ఉన్న బియ్యం దగ్గర నుంచి ఫ్రిజ్‌ దాకా అన్ని నీటికి తడిచిపోయాయని కన్నీరు మున్నీరయ్యారు. ఇంత జరిగినా మంత్రులు, అధికారులు ఎవరూ తమను పట్టించుకోలేదని మహిళలు తమ గోడును కోటంరెడ్డికి తెలియజేశారు.