Nov 25,2020 12:46

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల మనసు దోచేసిన కమలాహారిస్‌.. వంట చేసి కుటుంబ సభ్యుల హృదయాలను కూడా దోచేశారు. అమెరికాలో నవంబర్‌ నాల్గొవ గురువారం థ్యాంక్స్‌ గివింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకుంటారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టమైన కార్న్‌బ్రెడ్‌ వంటకాన్ని ఆమె తయారుచేశారు. వంటకాన్ని తయారుచేయడమే కాకుండా డిన్నర్‌ చేయడానికి డైనింగ్‌ టేబుల్‌ను కూడా నీట్‌గా రెడీ చేశారు. ఈ కార్న్‌బ్రెడ్‌ వంటకం లేకుండా థాంక్స్‌ గివింగ్‌లో భోజనం పూర్తి కాదని ఆమె రెండు సంవత్సరాల క్రితమే అన్నారు. అలాగే ఈ కార్న్‌బ్రెడ్‌ వంటకాన్ని ఎలా తయారుచేయాలో కూడా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు. హారిస్‌ షేర్‌ చేసిన రెసిపీ వీడియోను రెండు లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించడంతోపాటు.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంకో విషయమేమిటంటే.. ఎప్పుడైనా ఆమె ఒత్తిడి గురైట్లు అనిపించినా... వంటవైపే మొగ్గుచూపుతారట!

kamal haris