Oct 27,2021 23:46

మాట్లాడుతున్న పిఒ నవ్య

ప్రజాశక్తి -సీతంపేట: వెలుగు ఆధ్వర్యాన నిర్వహిస్తున్న వందన వికాస కేంద్రాల ద్వారా నిత్యావసర సరుకులు ఆశ్రమ పాఠశాలకు, గురుకులాలకు సరఫరా చేయాలని ఐటిడిఎ పిఒ బి.నవ్య అన్నారు. బుధవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో వెలుగు, వ్యవసాయశాఖ, జిసిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పిఒ మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలో 28 వందన వికాస కేంద్రాలు ఉన్నాయన్నారు. మరో 40 మంజూరు అయ్యాయని తెలిపారు. ఒక్కొక్క వందన వికాస కేంద్రానికి 300 మంది రైతులు సభ్యులుగా ఉంటారని వెలుగు ఎపిడి నారాయణరావు పిఒ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వందన వికాస కేంద్రాల ద్వారా కందిపప్పు, రాగి పిండి, పసుపు ఐటిడిఎ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలకు, గురుకులాలకు సరఫరా చేయాలన్నారు. ఒక్కొ వందన వికాస కేంద్రం ఎంత సరఫరా చేయాలన్నది నివేదిక తయారు చేయాలన్నారు. పాఠశాలలకు ఎంత అవసరమో నివేదిక తయారు చేయాలని పిఒ ఆదేశించారు. అనంతరం జిసిసి ఉత్పత్తుల మార్కెటింగ్‌ ఏ విధంగా ఉన్నాయని పిఒ రివ్యూ నిర్వహించారు. సమావేశంలో జిసిసి డివిజనల్‌ మేనేజర్‌ జి.సంధ్యారాణి, పిఎఒ భవానిశంకర్‌, జిసిసి మేనేజర్‌ నరసింహులు, ఎపిఎంలు గోవిందరావు, భవానిరావు, తదితరులు పాల్గొన్నారు.