May 03,2021 20:03

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'వకీల్‌ సాబ్‌' ఏప్రిల్‌ 9న థియేటర్స్‌ లో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిత్రంలో ఓ సన్నివేశంలో తన ఫోన్‌ నెంబర్‌ను స్క్రీన్‌పై చూపించారని సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండా ఫోన్‌ నెంబర్‌ చూపించడం వలన అతనికి ప్రతిరోజూ కాల్స్‌ వస్తున్నాయని, కొందరు నోటికొచ్చినట్టు తిడుతూ మానసికంగా ఇబ్బందిపెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే బాధితుడి తరపు లాయర్‌ వకీల్‌ సాబ్‌ నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపారు.