Nov 27,2020 19:28

ఓ చిట్టెలుక ను విషపూరిత పాము కరచుకొని పోతుంటే.. తల్లి ఎలుక తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ పాముతో పోరాడింది. చివరికి ఆ పాము చిట్టెలుకను వదిలి పక్కనే ఉన్న పొదల్లోకి పోయింది. తల్లి ప్రేమకు దర్పణం పట్టిన ఈ వీడియోను ఓ అటవీశాఖ అధికారి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అద్భుతంగా స్పందిస్తున్నారు.