
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : జాతీయభాష హిందీ ప్రచారానికి దశాబ్దాలుగా చేస్తున్న సేవలకుగానూ హిందీ పండిట్స్ ట్రైనింగ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సి.ఎల్.నాయుడు, హిందీ మంచ్ కన్వీనర్ కోనే శ్రీధర్‌లను కేంద్ర ప్రభుత్వ హిందీ అధికారి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో అనంతపురంలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి హిందీ మహా సమ్మేళనంలో వీరిని సన్మానించారు. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ హిందీ డైరెక్టరేట్‌లో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ డా. రాకేష్ కుమార్ శర్మ వీరికి దుశ్శాలువ కప్పి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేశారు. సిఎల్ నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుండగా, కోనే శ్రీధర్ ప్రచారక్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్బంగా వైసిపి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పూడి జనార్ధనరావు, ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గైబువలీ, విశ్రాంత డిఇఒ బలివాడ మల్లేశ్వరరావు తదితరులు అభినందించారు.