Feb 12,2021 23:15

సమావేశంలో మాట్లాడుతున్న లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌

ప్రజాశక్తి - నంద్యాల క్రైమ్‌: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని స్థానిక లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్వదేశీ జపం చేస్తూ విదేశీ దక్షిణ కొరియా పోసోకో కంపెనీకి మోడీ అమ్మి వేస్తున్న మోసపూరిత దుర్మార్గ విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. మోడీ గద్దె దిగేంత వరకు పోరాడి, సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా వైసిపి, టిడిపి, జనసేన నాయకులు విశాఖ ఉక్కు, ప్రత్యేక హౌదా కోసం రాష్ట్ర ప్రజలను, వామపక్ష పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేయాలన్నారు.