
రాంబిల్లి(విశాఖ): రాంబిల్లి మండలంలోని సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద కలవలపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జి.దేముడు నాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ సాధనకి ఈ నెల 5న జరుగు రాష్ట్ర బందులో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ నాయకులు కే.రాము, నాగేంద్ర, రమణ, ప్రసాద్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గన్నారు.