
విశాఖ రూరల్ : ప్రయాణికుల రద్దీ నివారణకు విశాఖ నుంచి తిరుపతి , హైద్రాబాద్‌కు పలు రైళ్లు నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు పచ్చజెండా ఊపారు. రైలు నెంబర్ 02727 విశాఖ-హైదరాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 1 నుండి ప్రతిరోజు సాయంత్రం 5.20 గంటలకు విశాఖపట్నం నుండి, 02728 నెంబర్‌గల రైలు ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతాయి. రైలు నెంబర్ 02784 సికింద్రాబాద్ - విశాఖ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 5 నుంచి సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.35 గంటలకు, 02783 నెంబర్ గల రైలు డిసెంబర్ 6 నుంచి విశాఖపట్నం నుండి రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతాయి. రైలు నెంబర్ 02708 తిరుపతి - విశాఖ డబుల్ డెక్కర్ ట్రై-వీక్లీ స్పెషల్ డిసెంబర్ 2 నుంచి తిరుపతి నుండి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.55 గంటలకు, 02707 నెంబర్ గల ర్తెలు డిసెంబర్ 3 నుంచి సోమ, గురు, శనివారాలలో రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతాయి. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠీ తెలిపారు.