Nov 30,2020 10:29

విశాఖ : విశాఖ గోపాలపట్నంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా తరుణ్‌ అనే వ్యక్తి సాగర్‌ నగర్‌ లో ఉన్న ముగ్గురిని కిడ్నాప్‌ చేసిన వైనం సోమవారం వెలుగు చూసింది. కిడ్నాప్‌కు గురయిన ముగ్గురిలో ఇద్దరు తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు తెలిసింది. వారిద్దరినీ స్థానిక లాడ్జి లో ఉంటున్న అమలాపురానికి చెందిన కిరణ్‌, రాజుఎస్‌ కోట కు చెందిన జగదీశ్‌ లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ కు పాల్పడిన తరుణ్‌ అనే వ్యక్తి కాకినాడకు చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.