Apr 14,2021 20:18

వేణు ఊడుగుల దర్శకత్వంలో రాణా హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం 'విరాటపర్వం'. డి.సురేష్‌ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు తాజాగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో 'విరాటపర్వం' చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో క్రమంగా సినిమా రిలీజ్‌లు వెనక్కి వెళుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన 'లవ్‌స్టోరి', ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన 'టక్‌ జగదీష్‌' చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వీటి సరసన 'విరాటపర్వం' కూడా చేరింది.