Oct 14,2021 19:55

'క్రీడల నేపథ్యంలోని సినిమాల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ '83' గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అలాంటి బయోపిక్స్‌లో నటించడానికి నేను కూడా సిద్ధమే. విరాట్‌ కోహ్లీ బయోపిక్‌ తీస్తే అందులో హీరోగా నటించడానికి రెడీ అని అక్కినేని అఖిల్‌ అంటున్నారు. దసరా కానుకగా 'మోస్ట్‌ ఎలిజిబుబ్‌ బ్యాచ్‌ లర్‌' మూవీతో అఖిల్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి పై విషయాలు చెప్పారు.