Oct 27,2021 22:07

ప్రజాశక్తి - గన్నవరం : అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై గన్నవరం విమానాశ్రయంలో ఫైర్‌ సేఫ్టీ మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌. పి.వి.రామారావు, ఎయిర్‌ పోర్టు ఏసీపీ వెంకట రత్నం, ఎస్పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ గుప్తా, గన్నవరం పోలీసులు, ఐదు హాస్పిటల్స్‌ డాక్టర్లు రమేష్‌, పిన్నమనేని, కామినేని, నాగార్జున, ఆయుష్‌, హాస్పిటల్స్‌ సిబ్బంది అయా హాస్పిటల్‌ అంబులెన్సుల సిబ్బంది, ఎయిర్పోర్ట్‌ అథారిటీ ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది, గన్నవరం ఫైర్‌ సర్విసు సిబ్బంది, ఎయిర్‌ లైన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.