తహశీల్దార్ వలీ బాష, ఎస్ఐ సతీష్ కుమార్
ప్రజాశక్తి - చిప్పగిరి: విలువలు, విశ్వసనీయతకు ప్రజాశక్తి నిలువుటద్దమని దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, కన్వీనర్ నారాయణ, జడ్పిటిసి విరుపాక్షి, వైసిపి సీనియర్ నాయకులు జూటూరు మారయ్య కొనియాడారు. సోమవారం చిప్పగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సభలో ప్రజాశక్తి 2021 క్యాలెండర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాశక్తి నిజాలను నిర్భయంగా రాసి ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. తహశీల్దార్ వలీబాష, ఎస్ఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న దేవరగట్టు ఆలయ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు,