Mar 02,2021 19:32

విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్‌, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'విక్రమార్కుడు'. గోకుల్‌ దర్శకత్వంలో కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్‌, అప్పసాని సాంబశివరావు నిర్మిస్తున్నారు. సిద్దార్థ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రం ప్రీ- రిలీజ్‌ వేడుకలో అమ్మ రాజశేఖర్‌, సూర్యకిరణ్‌ పాల్గొన్నారు. 'ఇది కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా. ఎక్కువ థియేటర్‌ లలో విడుదల చేస్తున్నాం' అని చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు అంటున్నారు.