Oct 27,2021 23:00

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: వికలాంగులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన 20 మంది వికలాంగులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అందజేశారు. స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఏడుగురు శారీరక వికలాంగులు, 13 మంది బధిరులు ఉన్నారు. అదేవిధంగా 20 మంది బధిరులకు టచ్‌ ఫోన్లను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు జె.వెంకటమురళి, కె.కృష్ణవేణి, జిల్లా వికలాంగులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అర్చన పాల్గొన్నారు.