
అనకాపల్లి : వికలాంగుల హక్కుల చట్టం - 2016ను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) జిల్లా కార్యదర్శి బి.నూక అప్పారావు డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చట్టానికి డ్రాఫ్ట్ రూల్స్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పింఛన్‌ను రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాపేటి భాస్కరరావు, సూర్య అప్పారావు, జి.సన్యాసిరావు, బుద్ధ ధనలక్ష్మి, పి.శ్రావణి, నరసింహారావు పాల్గొన్నారు.