Mar 05,2021 19:01

vedukallo mla dnr

వికాస్‌లో ఫ్రెషర్స్‌డే వేడుకలు
కైకలూరు : స్థానిక వికాస్‌ జూనియర్‌ అండ్‌ డిగ్రీ కాలేజీలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు శుక్రవారం జరిగాయి. వికాస్‌ కాలేజీ యాజమాన్యం టి.వెంకటేశ్వరరావు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రతి విద్యార్థి కూడా మంచి నడవడికలో నడవాలన్నారు. తద్వారా జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలుగుతారన్నారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సీతారామయ్య, సిహెచ్‌ శ్యామ్‌, నాగరాజు, మూర్తి, సుబ్రహ్మణ్యం, భాగ్యశ్రీ, సుమశ్రీ, చిన్ని కష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యకు పేదరికం అడ్డుకాదు : లంకిశెట్టి