Feb 28,2021 07:37

విజయనగరం కంటోన్మెంట్‌ : ఆదివారం ఉదయం విజయనగరం పట్టణాన్ని భారీగా పొగ మంచు కమ్మేసింది. ఉదయం 7:30 గంటలు అవుతున్నా పొగ మంచు వీడలేదు. మరోవైపు పొగమంచు కారణంగా ఎండ కూడా రాకపోవడంతో వాహనదారులు కొంచెం ఇబ్బందులు పడ్డారు. రహదారులను కమ్మేయడంతో రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక వాహనాదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. ముఖ్యంగా ఉదయం 7:30 గంటలు అవుతున్నా వాహనాలకు లైట్లు వేసుకుంటూ వెళ్లడం కనిపించింది. అయితే విపరీతంగా కురుస్తున్న ఇలాంటి పొగ మంచు వల్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.