
ముంబయి: విజయ్ హజారే ట్రోఫీలో కరోనా కలకలం రేపుతోంది. బీహార్ జట్టుకు చెందిన ఓ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో జట్టులోని మిగతా సభ్యులందరికీ మంగళవారం కరోనా పరీక్షలు జరిపినట్లు బీహార్ క్రికెట్ అసోసియేసియేషన్(బిసిఏ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎలైట్ గ్రూప్ాసిలో ఉన్న బీహార్ జట్టు సోమవారం కర్ణాటక జట్టుతో తలపడగా.. బుధవారం ఉత్తరప్రదేశ్‌తో తలపడాల్సి ఉంది. అలాగే గతవారం హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడు కరోనా బారినపడినట్లు తెలిసింది.