Oct 28,2021 15:33

ప్రజాశక్తి- పిఠాపురం
గొల్లప్రోలు మండలం దుర్గాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎపి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని స్థానిక మంగమ్మ పేటలోనే ఉన్న మాల మహానాడు కార్యాలయంలో అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుబ్బల రాజు మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక దష్టి సారించి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సత్తిబాబు, చిన్న రాజు బాబు, సింహాచలం,కపానందం, కన్నారావు, డానియల్‌, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు