Feb 26,2021 21:43

మాట్లాడుతున్న చంద్రయ్య

'విఎస్‌యు'లో ఎగ్జిక్యూటీవ్‌ ఎంబిఎ కోర్సు
ప్రజాశక్తి - వెంకటాచలం :విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబిఎ కోర్సు ప్రవేశపె డుతున్నట్లు విసి చంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగాలలో ప్రగతి సాధించేందుకు రెండేళ్ల కాల వ్యవధి గల ఎగ్జిక్యూటివ్‌ ఎంబిఎ కోర్సును తీసుకొస్తున్నామన్నారు. డిగ్రీ పొంది నేరుగా ఉద్యోగ అవకాశాలు పొంది సరైన పదోన్నతలు పొందలేక పోతున్న అభ్యర్థులు ఈ కోర్స్‌ ద్వారా నిర్వాహక, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. ఈ కోర్స్‌ విభాగ అధిపతి జె. విజేత మాట్లాడుతూ ఏ డిగ్రీయినా ఉత్తీర్ణత సాధించి ఐదేళ్ల ఉద్యోగ అనుభవం కలిగి ఎగ్జిక్యూటివ్‌ ఆపై హోదాలో పనిచేస్తున్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉద్యోగులు మాత్రమే ఈ కోర్స్‌ కి అర్హులన్నారు. వారి సౌకర్యార్థం తరగతులను సాయంత్రం వేళల్లో, వారాంతపు రోజుల్లో నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు రుసుము రూ. 1000 రిజిస్ట్రార్‌ ద్వారా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పేరున డిడి ద్వారా చెల్లించాలన్నారు.