
ప్రజాశక్తి - విజయవాడ
నిరాశ్రయులు, ఎటువంటి వసతి లేక రోడ్ల పక్కన పుట్‌పాత్‌లపై ఉంటున్న వారిని గుర్తించి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహాలకు తరలించే పనిని కమ్యూనిటీ ఆర్డ్నైజర్లు (సిఒ), సోషల్ వర్కర్స్ (ఎస్డబ్య్లు) విధిగా నిర్వర్తించాలని పిఒ-యుసిడి డాక్టర్ జె.అరుణ ఆదేశించారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో పుట్‌పాత్‌లు, ఇతర సబ్‌వేల కింద షెల్టర్ చేసుకొని ఉంటున్న పలువురిని పిఒ- యుసిడి ఆధ్వర్యంలో వారి సిబ్బంది శనివారం రాత్రి గుర్తించి నిరాశ్రయుల వసతి గృహాలకు తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ మాట్లాడుతూ హనుమాన్‌పేట, రాణిగారితోట, సితార జంక్షన్, వెహికల్ డిపో దగ్గర రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నిరాశ్రయుల వసతి గృహాలకు నిరాశ్రయులను తరలించడానికి సిఒలు, ఎస్డబ్ల్యలు నగరంలోని వీధులు తిరిగి నిరాశ్రయులను గుర్తించాలన్నారు.