Oct 27,2021 22:23

మాట్లాడుతన్న ఎం బాలకాశి

విద్యుత్‌ చట్ట సవరణతో ఇబ్బందులు
ప్రజాశక్తి నెల్లూరు విద్యుత్‌ చట్ట సవరణ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని యునైటెడ్‌ ఎలక్ట్రసిటీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ (యుఇఇయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశీ పేర్కొన్నారు. బుధవారం నగ రంలోని రేబాల లక్ష్మీ నరసింహ రెడ్డి జూనియర్‌ స్మారక భవనం యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కస్‌ యూనియన్‌ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు యూనియన్‌ నాయకులు పి.రామయ్య అధ్యక్షత వహిం చారు. బాలకాశి , సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్‌ , యు ఇఇ యు రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిరాల సూరిబాబు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. బాలకాశీ మాట్లాడుతూ అక్టోబర్‌ 3 వ తేదీన రాష్ట్ర సదస్సులో చేసిన తీర్మానాలు ప్రతి కార్మికుడు తెలుసుకోవాలన్నారు. జెన్‌ కో,ట్రాన్స్‌ కో, డిస్కాం లను ప్రవేటికరణ చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా యూనియన్‌ పోరాటాలు చేస్తోందన్నారు. విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న ప్రతి కార్మికుడిని రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను రెగ్యులర్‌ చేయాటానికి రాష్ట్ర కమిటీ ఇచ్చే ప్రతి పిలుపుకు కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి కె అజరు కుమార్‌ మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో కార్మికులు నిరంతరం ప్రాణాలు తెగించి విధులు నిర్వహిస్తు న్నారని వారి హక్కుల సాధన కోసం చేసే ప్రతి కార్యకమానికి మా మద్దతు ఉంటుందన్నారు. యూనియన్‌ నాయకులు డి సూరిబాబు మాట్లా డుతూ విద్యుత్‌ రంగం లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎస్‌ పి డి సి ఎల్‌ ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్‌,జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కష్ణ,రాష్ట్ర ఆఫీస్‌ బేరర్‌ జి.యస్‌.బాబు,జెన్‌ కో నాయకులు నాగరాజు, మీటర్‌ రీడర్స్‌ జిల్లా కార్యదర్శి వెంకట్‌, జెఎల్‌ఎం 2 జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్‌ కుమార్‌, యుఇఇయు రాష్ట్ర ఆఫీస్‌ బేరర్‌ పెంచల్‌ ప్రసాద్‌, నగర కార్యదర్శి హరి నారాయణ, ఆత్మకూరు డివిజన్‌ అధ్యక్షులు విజయరామి రెడ్డి ,జయ శంకర్‌, కాంట్రాక్టు కార్మికుల అన్ని డివిజన్‌ అధ్యక్ష,కార్యదర్సులు సునీల్‌, శ్రీనివాసులు, సుబ్రమణ్యం, నాంచార య్య, మహేష్‌, మస్తాన్‌, ముఖ్య నాయకులు మోహన్‌, నవీన్‌, ఏడుకొండలు,అరిఫ్‌,శివ శంకర్‌, మహేంద్ర, వెంకటేష్‌, భాస్కర్‌, వసంత్‌, అబ్దుల్‌, మణికంట, రమేష్‌, మౌలా పాల్గొన్నారు