Oct 28,2021 16:48

ప్రజాశక్తి-శ్రీకాకుళం
విద్యుద్ఘాతంతో ఒ యువకుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో గురువారం విద్యుద్ఘాతంతో కోటపాలెం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. జీరుపాలెంలో గురువారం ఓ గృహనిర్మాణానికి రాడ్‌ బెండింగ్‌ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి, అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.