Mar 02,2021 23:10

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు


- వైష్ణవిలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు:
 విద్యార్థులు మంచిగా చదివి ఉన్నతంగా ఎదగాలని ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుట్టా రంగయ్య, ప్రముఖ న్యాయవాది కెఎమ్‌డి.అజ్మతుల్లా హక్‌ ఆకాంక్షించారు. మంగళవారం వైష్ణవి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ సత్యశ్రీ, డాక్టర్‌ శిల్పా, ఫ్యాషన్‌ డిజైనర్‌ జిడి.కనక నిధి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్‌ జిడి.లింగప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు దేశభక్తి, జానపద, సినీ గేయాలకు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కళాశాల డైరెక్టర్‌ గంగప్ప, డిగ్రీ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మధు బాబు, మునెప్ప పాల్గొన్నారు.