
ప్రజాశక్తి-టంగుటూరు:స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్దులకు బుధవారం ఉచిత కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కళాశాలలోని దాదాపు 450 మందికి స్వాబ్, రాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వీరి నమూనాలను సేకరించి ఫలితాల నమిత్తం ఒంగోలు ల్యాబుకు పంపినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.శ్రీనివాసన్, హెల్త్ కోఆర్డినేటర్లు కె.శ్రీనివాసులు, పి.బ్రహ్మం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పరమేష్ ఒంగోలు వైద్యాధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.