- ఫోన్లో జెసితో మాట్లాడిన వైద్యులు
- తక్షణమే సమాచారం అందించండి : డిఇఒ
ప్రజాశక్తి - వెలుగోడు: రేగడగూడూరు పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో డిఇఒ సాయిరాం పాఠశాలను తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన వేల్పనూరు వైద్యులు గోపాల్ నాయక్, ఎంఇఒ బ్రహ్మం నాయక్‌తో కలిసి కరోనా సోకిన విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. పాఠశాలను శానిటైజేషన్ చేయించారు. పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయాలని తెలిపారు. పట్టణంలోని ఎంఆర్సి భవనంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి, నాడు - నేడు పనుల వివరాలను సేకరించారు. సమయానికి ఇసుక అందక సమస్య ఉందని ప్రధానోపాధ్యాయులు డిఇఒ దృష్టికి తెచ్చారు. ఆయన వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.
ఫోన్లో జెసితో మాట్లాడిన వైద్యులు : రేగడగూడూరు గ్రామానికి చేరుకున్న డిఇఒ సాయిరాం, వైద్యులు గోపాల్ నాయక్‌ను కలిసిన, అనంతరం జెసి రామ్‌సుందర్ రెడ్డితో ఫోన్లో విద్యార్ధుల వివరాలను తెలియజేశారు. షెడ్యూలులో భాగంగా వీరా బస్సు బృందం రేగడగూడూరు గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయ, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారని, ఆరుగురు 8వ తరగతి విద్యార్థులకు, పదో తరగతిలో ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ తేలిందని, ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనబడడం లేదని వివరించారు. నేడు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు సుమారు 35 మందికి టెస్టులు చేసినట్లు సమాచారం అందించారు.
రేగడగూడూరు పాఠశాలలో డిఇఒ సాయిరాం