
పోషకాహారం అందజేస్తున్న ఓబులేశు
విద్యార్థులకు చేయూత
ప్రజాశక్తి - గూడూరు :విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ ఓబులేశు పేర్కొన్నారు. సి.ఎస్ఎం ప్రాథమిక పాఠశాల లో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో ఇండస్ టవర్స్ సహకారంతో విద్యార్థులకు పౌష్టికాహారం, విద్యా సామగ్రిని వారి తల్లిదండ్రులకు అందజేశారు. ముఖ్య అతిథిగా ఓబులేశు పాల్గొని అందజేశారు.అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని గుర్తు చేశారు. ప్రధానోపాధ్యాయులు సౌజన్య , పరంజ్యోతి ,అక్షయ పాత్ర మేనేజర్ విక్రమ్ రెడ్డి , విద్య కమిటీ చైర్మన్ సుమతి ఉన్నారు.