Oct 27,2021 23:24

ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు ఎస్‌ఎఫ్‌ఐ నేతల వినతి
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ :
విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో 'నాడు-నేడు' పనులను పరిశీలించడానికి వచ్చిన ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ కమిషనర్‌ శేషుబాబుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కష్ణాజిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.కోటి, ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్‌ విద్యాసంస్థల వారు విద్యార్థులను ఫీజుల కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని వివరించారు. ఫీజులు కట్టిన విద్యార్థులను పరీక్షలు రాయించకపోవడం, బయట పంపడం జరుగుతోందన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టాలని కోరారు. అనుమతుల్లేని కళాశాలల యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఓ.యేసుబాబు, కళాశాల కార్యదర్శి రాధాకష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు అభిషేక్‌, సుష్మా, భారత్‌ తదితరులు పాల్గొన్నారు.